Kabaddi: భారత్ చేతిలో మరోమారు చిత్తయిన పాక్.. కబడ్డీలో టీమిండియా గెలుపు

షార్ట్స్‌లో చూడండి
మ్యాచ్ ఏదైనా ప్రత్యర్థి పాకిస్థాన్ అంటే రెచ్చిపోయే భారత ఆటగాళ్లు మరోమారు దాయాదిని చిత్తు చేశారు. దుబాయ్‌లో జరుగుతున్న కబడ్డీ మాస్టర్స్ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై చెలరేగి ఆడి 36-20తో ఘన విజయం సాధించింది.

అజయ్ ఠాకూర్ సారథ్యంలోని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఆట ఆరంభం నుంచి ముగిసే వరకు భారత ఆటగాళ్లు ఎక్కడా పట్టు సడలకుండా చూసుకున్నారు. ప్రథమార్థంలో 22-9 పాయింట్లతో ఉన్న భారత్ ద్వితీయార్థంలోనూ అదే జోరును కొనసాగించి విజయాన్ని అందుకుంది. ఈ కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో పాక్‌, కెన్యాలతో కలిసి భారత్‌ గ్రూప్‌-ఎలో ఉండగా, గ్రూప్‌-బిలో ఇరాన్‌, కొరియా, అర్జెంటీనా ఉన్నాయి.
Go Back to Shorts
Kabaddi
Pakistan
India
Masters Dubai

More Telugu News