aap: ఆప్ ఎమ్మెల్యే అమర్ జీత్ సింగ్ పై మైనింగ్ మాఫియా దాడి

షార్ట్స్‌లో చూడండి
పంజాబ్ లోని రోపార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే అమర్ జీత్ సింగ్ సండోయ పై మైనింగ్ మాఫియా దాడికి పాల్పడింది. స్థానిక బీహరా గ్రామానికి సమీపంలో కొందరు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారనే సమాచారం ఆయనకు అందింది. దీంతో, మీడియా ప్రతినిధులను తన వెంట తీసుకుని అమర్ జీత్ సింగ్ తన వాహనంలో అక్కడికి వెళ్లారు.

ఈ సమాచారం ముందుగానే తెలుసుకున్న మాఫియా ముఠా, అక్కడ తవ్వకాలు జరుపుతున్న యంత్రాలు, పరికరాలను వేరేచోటకు తరలించింది. అమర్ జీత్ సింగ్ అక్కడికి చేరుకోగానే మాఫియా సభ్యులు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే గన్ మెన్ లపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో అమర్ జీత్ సింగ్  ఛాతీకి స్వల్పగాయాలయ్యాయి.  
Go Back to Shorts
aap
punjab

More Telugu News