పసుపుతాడు మెడలో కట్టి ఫేస్ బుక్ లో పోస్టులు... ఇంట్లో నిలదీయడంతో యువతి ఆత్మహత్య!
- ఐదు రోజుల క్రితం అమ్మాయిని పెళ్లి చేసుకున్న బాబు
- ఫొటోలు చూసి కుమార్తెను నిలదీసిన తల్లిదండ్రులు
- మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భవాని
- పరారీలో ఉన్న బాబు కోసం పోలీసుల గాలింపు
వీటిని చూసిన బాబు ఫ్రెండ్స్ విషయాన్ని భవాని బంధువుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఆమెను మందలించారు. అతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పిన భవాని, నిన్న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భవాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బాబును త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.