సచిన్ కుమారుడైనంత మాత్రాన.. నాకు స్పెషల్ కాదు!: అండర్-19 కోచ్
- అండర్-19 జట్టుకు ఎంపికైన అర్జున్ టెండూల్కర్
- త్వరలో శ్రీలంకతో సిరీస్
- అందరినీ ఒకేలా చూస్తానన్న బౌలింగ్ కోచ్
ఈ సందర్భంగా అండర్-19 బౌలింగ్ కోచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ, అర్జున్ పట్ల తాను ప్రత్యేక శ్రద్ధను చూపనని... అందరు ఆటగాళ్ల మాదిరే అతన్ని కూడా చూస్తానని తెలిపాడు. ఒక కోచ్ గా జట్టులోని ఆటగాళ్లంతా తనకు సమానమేనని చెప్పాడు. ప్రతి ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేసేలా చూడటమే తన కర్తవ్యమని తెలిపాడు