New Delhi: గవర్నర్‌ కార్యాలయం నుంచి.. అంబులెన్సులో ఆసుపత్రికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి!

షార్ట్స్‌లో చూడండి
వారం రోజులుగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతో పాటు మరో ఇద్దరు మంత్రులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలోనే నిరాహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. మనీశ్‌ సిసోడియా కీటోన్‌ స్థాయి 7.4కి చేరడంతో ఆయనను అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జీపీ ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు ఆయనకు వైద్యులు పలు పరీక్షలు చేశారు. మిగతా మంత్రుల దీక్ష కొనసాగుతోంది.

కాగా, ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు రాకుండా చేస్తోన్న ఆందోళనను విరమింపజేసేలా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ చొరవ తీసుకోవాలని ఆప్‌ మంత్రులు డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్లను అనిల్‌ బైజాల్‌ పట్టించుకోకపోవడంతో ఆప్‌ నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
Go Back to Shorts
New Delhi
AAP

More Telugu News