airtel: ఎయిర్ టెల్ నుంచి రూ.597 ప్లాన్... వ్యాలిడిటీ 168 రోజులు

షార్ట్స్‌లో చూడండి
భారతీ ఎయిర్ టెల్ రూ.597 రీచార్జ్ ప్లాన్ ను ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 168రోజులు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. డేటా విషయానికొస్తే 168 రోజుల వరకు 10 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఈ ఉచిత డేటా పరిమితి ముగిస్తే కస్టమర్లు డేటా టాపప్ వేసుకోవాల్సి ఉంటుంది.

తక్కువ డేటా వినియోగించే వారు, దీర్ఘకాలం వ్యాలిడిటీని కోరుకునే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకంగా ఇది కనిపిస్తోంది. అయితే, ఈ ప్లాన్ ప్రస్తుతానికి కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. ఎయిర్ టెల్ లో దీర్ఘకాలం వ్యాలిడిటీతో కూడిన మరో ప్లాన్ రూ.995 కూడా ఉంది. దీని వ్యాలిడిటీ ఆరు నెలలు. కాల్స్ తోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాకపోతే నెలకు ఒక జీబీ డేటా మాత్రమే ఉచితంగా లభిస్తుంది.
Go Back to Shorts
airtel
prepaid plan

More Telugu News