పార్టీ నేతలకు ఆమె 'సేవ' నచ్చిందంటే అభ్యంతరం ఏంటి?: కర్ణాటక మంత్రి జయమాలపై మహిళా నేత లక్ష్మి!
- జయమాల సేవలు నచ్చే మంత్రి పదవి ఇచ్చారన్న కేపీసీసీ మహిళా అధ్యక్షురాలు
- 'సేవ' పదంపై మీడియాలో రాద్ధాంతం
- ఉత్తర కర్ణాటక భాషలో ఆ పదం కామనన్న లక్ష్మీ హెబ్బాళ్కర్
- జయమాలను కలిసి వివరణ ఇస్తానని వెల్లడి
తన నోటి నుంచి వచ్చిన 'సేవ' అన్న పదాన్ని అపార్థం చేసుకునేలా ప్రచారం చేశారని ఆరోపించిన ఆమె, తన మాటలకు జయమాల నొచ్చుకున్నారని తెలుసుకుని తాను బాధపడినట్టు తెలిపారు.
తనకన్నా ఆమే పార్టీకి ఎక్కువగా సేవ చేసిందని, అందుకే ఆమెకు మంత్రి పదవి లభించిందన్న భావన తనలో ఉందని చెప్పారు. ఆమెకు పదవి దక్కడం పట్ల తనకు అభ్యంతరాలు లేవని, తాను జయమాలను కలిసి వివరణ ఇచ్చి, ఊరడిస్తానని చెప్పారు.