వేసవి ముగిసినా ఏమాత్రం తగ్గని రద్దీ... వెంకన్న దర్శనం లేకుండానే వెనుదిరుగుతున్న భక్తులు!
- భక్తులతో నిండిన కంపార్టుమెంట్లు
- రెండు కిలోమీటర్ల మేరకు క్యూలైన్
- సర్వదర్శనానికి 35 గంటల సమయం
సర్వదర్శనం క్యూలైన్ లో స్వామి దర్శనానికి 35 గంటల సమయం పడుతూ ఉంది. అంటే ఈ మధ్యాహ్నం తిరుమలకు వస్తే, ఎల్లుండే స్వామి దర్శనం. ఈ పరిస్థితుల్లో అంతసేపు వేచి ఉండలేక, పలువురు భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనక్కు వెళ్లిపోతున్నారు. ఇక నడకదారిలో ప్రయాణించి వచ్చిన భక్తులు 13 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దె గదులు ఏ మాత్రం అందుబాటులో లేకపోవడంతో ఇనుప షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాల్లోనే భక్తులు పడిగాపులు పడుతున్నారు.