mamatha: ఈద్ జరుగుతున్న విషయం వాళ్లకి తెలియదా?: నీతి ఆయోగ్‌ సమావేశంపై మమతా బెనర్జీ

  • తేదీ మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను
  • నేను అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తాను
  • హిందువులను ప్రేమించడం అంటే ముస్లింలను ద్వేషించమని అర్థమా?

ఈరోజు ముస్లింలు రంజాన్‌ పండుగ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో రేపు నీతి ఆయోగ్‌ సమావేశం జరగనుంది. దీంతో ఆ సమావేశం వాయిదా వేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాసినప్పటికీ నీతి ఆయోగ్‌ అందుకు ఒప్పుకోలేదు. తాజాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై మాట్లాడారు. ఈద్ ఉన్న విషయం కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలియదా? అని నిలదీశారు. అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా తేదీని మార్చాలని గతంలో తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.

కాగా, ఈరోజు జరిగిన సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న మమతా బెనర్జీ అనంతరం మాట్లాడుతూ... భారత్‌ మనందరిదని, తాను అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తానని చెప్పారు. తాను ముస్లింలను బుజ్జగిస్తున్నానని కొందరు ఆరోపిస్తుంటారని, హిందువులను ప్రేమించడం అంటే ముస్లింలను ద్వేషించమని అర్థమా? అని ప్రశ్నించారు. 

More Telugu News