modi: మోదీ ఫిట్ నెస్ ఛాలెంజ్ పై జూపూడి విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
 ప్రధాని మోదీ చేసిన ఫిట్ నెస్ ఛాలెంజ్ పై ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ విమర్శలు చేశారు. నాయకులు పెంచాల్సింది బాడీ కాదు.. బుర్ర అని సెటైర్లు విసిరారు. ప్రధాని పదవి అంటే కుస్తీ పోటీ కాదనే విషయం తెలుసుకోవాలని, బ్యాంకులను దోచుకున్న వారిని మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా కడపకు స్టీల్ ప్లాంట్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కడపకు స్టీల్ ప్లాంట్ విషయమై వైసీపీ అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టులను ‘సినిమాలు’ అంటూ పోల్చడం తగదని, జగన్ కు నిజమైన సినిమాను వచ్చే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నా పేరుకే బీజేపీ అధ్యక్షుడు..వాస్తవానికి జగన్ కు ఏజెంట్ అని జూపూడి ఆరోపించారు.
Go Back to Shorts
modi
jupudi

More Telugu News