ఇద్దరు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టేసిన బన్నీ!
- విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
- ఆ తరువాత ప్రాజెక్టులను కూడా ప్లాన్ చేసిన బన్నీ
ప్రస్తుతం ఆయన విక్రమ్ కుమార్ తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కథా పరంగా బన్నీ చెప్పిన మార్పులను చేసేసి విక్రమ్ కుమార్ రంగంలోకి దిగనున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తోను .. సురేందర్ రెడ్డితోను తన సినిమాలు ఉండేలా బన్నీ చూసుకున్నాడు. గతంలో త్రివిక్రమ్ తో చేసిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన 'రేసు గుర్రం' ఘన విజయాన్ని సాధించింది. అందువలన ఈ ఇద్దరి దర్శకులను బన్నీ లైన్లో పెట్టేశాడని అంటున్నారు. ఇకపై బన్నీ ఇంత గ్యాప్ రానీయడన్న మాట.