ఏపీ విషయంలో అమిత్ షా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు: జీవీఎల్ నరసింహారావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ విషయంలో అమిత్ షా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు: జీవీఎల్ నరసింహారావు

  • ఏపీపై అమిత్ షా చూపిస్తున్న అభిమానం అంతా ఇంతా కాదు
  • ఆంధ్రా బిడ్డగా నేను ఎంతో గర్విస్తున్నాను
  • టీడీపీ సర్కార్ వదిలేసిన బాధ్యతలను మేము తీసుకున్నాం
ఏపీ విషయంలో అమిత్ షా చాలా ఎమోషనల్ గా ఫీలయ్యారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలను ఈరోజు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ తదతర నేతలు కలిశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందని అమిత్ షా తమతో ప్రస్తావించారని చెప్పారు. ఏపీపై అమిత్ షా చూపిస్తున్న అభిమానానికి ఆంధ్రా బిడ్డగా తాను ఎంతో గర్విస్తున్నానని అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బాధ్యతలు వదిలేసి కేవలం తన పార్టీ గురించే పట్టించుకుంటున్నారని, టీడీపీకి ప్రచారం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వదిలేసిన బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని నడుస్తున్నామని అన్నారు. ఏపీలోని ప్రతి ప్రాజెక్టులో టీడీపీ ప్రభుత్వానికి వాటా ఎంతన్నదే ముఖ్యమని, ఏ ప్రాజెక్టు అయితే వాటాలు రావో ఆ ప్రాజెక్టును టీడీపీ వద్దంటోందని, అధికారంలో ఉండగానే డబ్బు సంపాదించుకోవాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.
gvl
amit shah
delhi

More Telugu News