షకీలా 'శీలవతి'కి కష్టం... సినిమా చూడకుండానే 'నో' చెప్పిన సెన్సార్!
- షకీలా 250వ చిత్రంగా 'శీలవతి'
- పేరు మార్చాలని సూచించిన సెన్సార్ బోర్డు
- చూడకుండా ఎలా చెబుతారంటున్న షకీలా
"షకీలా సినిమాకు 'శీలవతి' అన్న పేరు ఉండవద్దని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పారట. అది ఎందుకో నాకు తెలియలేదు. నా పాత డబ్బింగ్ సినిమాకు కూడా 'శీలవతి' అనే పేరుంది. నా ఫిల్మ్ చూడకుండానే ఈ టైటిల్ సూట్ కాలేదని ఎలా చెబుతారు? నాకు రీజన్ తెలియాలి. మొత్తం పబ్లిసిటీ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత ఇదేంటి? ఆ టైటిల్ మార్చలేము. ఫిల్మ్ ఓసారి చూసి రీజన్ చెప్పండి" అని షకీలా కోరింది.