షాపును తగలబెట్టే క్రమంలో రౌడీ షీటర్ కు అంటుకున్న మంటలు

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ శివారు ప్రాంతం అల్వాల్ లో రౌడీ షీటర్ నవీన్ నానా హంగామా సృష్టించాడు. నెలకు రూ.10 వేలు మామూళ్లు ఇవ్వాలంటూ ఓ షాపు యజమానిని బెదిరించాడు. సదరు యజమాని అంత మొత్తం ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆ షాపులో ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు రౌడీ షీటర్ యత్నించాడు. ఈ క్రమంలో నవీన్ కు మంటలు అంటుకుని గాయాల పాలయ్యాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డైనట్టు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
alwal
Hyderabad

More Telugu News