శ్రీరెడ్డి వివాదంపై స్పందించిన హీరో నాని భార్య అంజన

  • పబ్లిసిటీ కోసం ఎదుటి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు
  • వారి కామెంట్లను ఎవరూ నమ్మరు
  • సొంత జీవితాలను సైతం దిగజార్చుకుంటున్నారు
టాలీవుడ్ హీరో నానిపై నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో రాయడానికి కూడా వీల్లేని భాషను ఉపయోగిస్తూ, నానిపై విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించి శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు పంపించాడు. దీనికి ప్రతిస్పందనగా... తాను కూడా చట్టపరంగానే పోరాటం చేస్తానంటూ శ్రీరెడ్డి తెలిపింది.

ఈ నేపథ్యంలో ఈ వివాదంపై నాని భార్య అంజన ట్విట్టర్ ద్వారా స్పందించారు. "సినీ పరిశ్రమ చాలా గొప్పదే అయినప్పటికీ... పబ్లిసిటీ కోసం కొందరు వ్యక్తులు ఇతరుల జీవితాలను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారు. వారు చేస్తున్న నీచమైన కామెంట్లను ఎవరూ నమ్మరు. వారి వ్యక్తిగత జీవితాలను దిగజార్చుకోవడానికి కూడా వారు ఎలా సిద్ధపడుతున్నారో" అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
nani
srireddy
anjana
wife
tollywood

More Telugu News