2019 ఎన్నికల్లో ఏపీలో ఏ సీటు గెలవగలరో కన్నా చెప్పగలరా?: మంత్రి కళా వెంకట్రావు
- విమర్శలు చేస్తేనే రాజకీయాలని కన్నా భావిస్తున్నారు
- ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ ధర్నాలు చేపడుతోంది?
- పసలేని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఏం సాధిస్తారు?
పసలేని ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్న తమపైనే కన్నా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ సీటు గెలవగలరో కన్నా చెప్పగలరా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి రేటు 10.5 శాతం ఉంటే దేశంలో బీజేపీ సాధించింది 7.5 శాతం మాత్రమేనని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు.