Cricket: వ్యాఖ్యాతగా డేవిడ్‌ వార్నర్‌ .. వన్డే సీరీస్ కు కామెంటరీ!

షార్ట్స్‌లో చూడండి
కొన్ని నెలల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచులో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ ఏడాది నిషేధాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. మైదానంలో ఆడే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. కొన్ని రోజుల్లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే సిరీస్‌లో ఛానెల్ 9 తరపున కామెంటేటర్ల బృందంతో కలిసి వార్నర్‌ కూడా వ్యాఖ్యాతగా ఉండనున్నాడు. లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో వచ్చే బుధవారం తొలి వన్డే జరగనుంది. అనంతరం శనివారం కార్డిఫ్‌లో రెండో వన్డేలో జరుగుతుంది. ఈ రెండో వన్డేలో వార్నర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు.         
Go Back to Shorts
Cricket
devid
Australia

More Telugu News