వాళ్ల ఆస్తులు వేలం వేస్తున్నారుగా.. మరి జగన్‌వి ఎందుకేయరు?: చంద్రబాబు
- నీరవ్ మోదీ కంటే జగన్‌ది పెద్ద మోసం
- అవినీతితో ఆస్తులు పోగేశారు
- ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని డ్రామాలు
నీరవ్ మోదీ కంటే జగన్ తక్కువేం కాదన్న సీఎం, అవినీతితో ఆస్తులు పోగేశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై తాము పోరాడుతుంటే, జగన్‌పై ఉన్న అవినీతి కేసులను కేంద్రం నీరుగారుస్తోందని ఆరోపించారు. కేవలం ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని జగన్ కేంద్రంతో బేరాలాడి కేసుల మాఫీకి కుమ్మక్కయ్యారన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన మోసానికి ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు.