khushbu: కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన నన్నేం చేయమంటారు?: 'కాలా'పై సినీనటి ఖుష్బూ

షార్ట్స్‌లో చూడండి
దేశాన్ని సమైక్యంగా, సెక్యులర్‌గా ఉంచుతూ ప్రజాస్వామ్యాన్ని బతికించే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ మాత్రమేనని, తాను అందుకే ఆ పార్టీలో చేరానని సినీనటి ఖుష్బూ అన్నారు. తాజాగా ఆమె ట్విట్టర్‌లో తన ఫాలోవర్లతో చాటింగ్‌ చేస్తూ... కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ రజనీకాంత్‌ ‘కాలా’ సినిమాను అడ్డుకున్నారని, ఇంకా కాంగ్రెస్‌కే మద్దతుగా నిలుస్తారా? అని ఓ అభిమాని అడిగాడు.

 దానికి ఖుష్బూ సమాధానం చెబుతూ తాను  కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన తననేం చేయమంటారని ప్రశ్నించారు. కాగా, యువత కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని, వారే మన దేశ భవిష్యత్తని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను తెలుగులో ప్రస్తుతానికి ఏ సినిమాలోనూ నటించట్లేదని తెలిపారు.
Go Back to Shorts
khushbu
Congress

More Telugu News