సికింద్రాబాద్ లోని ఏషియన్ పెయింట్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
- రాణిగంజ్ లోని ఏషియన్ పెయింట్స్ గోదాంలో అగ్నిప్రమాదం
- ఎగసిపడుతున్న మంటలు
- మంటలను ఆర్పే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది
అయితే, చిన్న గల్లీలో ఈ గోదాం ఉండటంతో అక్కడికి అగ్నిమాపక యంత్రాలు వెళ్లడం కష్టసాధ్యంగా మారింది. దీంతో, దూరం నుంచి మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాలు, దుకాణాలకు కూడా మంటలు వ్యాపిస్తాయేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. కాగా, రైల్వేట్రాక్ కు పక్కనే ఈ గోదాం ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.