Pawan Kalyan: మృతుడు శివ కుటుంబాన్ని పరామర్శించి.. రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసిన పవన్ కల్యాణ్
ఇటీవల విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా హైటెన్షన్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో ఆయన అభిమాని భీమవరపు శివ (31) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ పరామర్శించారు. శివ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసి, ఆయన కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కాగా, పవన్ చేస్తోన్న జన పోరాట యాత్ర కొనసాగుతోంది.