manchu lakshmi: 'w/o రామ్' సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్

షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేస్తూ మంచు లక్ష్మి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆమె ప్రధాన పాత్రగా .. విజయ్ యలకంటి దర్శకత్వంలో 'w/o రామ్' చిత్రం రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ఆమె భర్త పాత్ర హత్య చేయబడుతుంది. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఒక వైపున పోలీసులు ప్రయత్నిస్తుంటే .. మరో వైపున ఆమె కూడా తన ప్రయత్నం తాను చేస్తుంటుంది. అదే విషయాన్ని ఈ ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో, ప్రియదర్శి .. ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Go Back to Shorts
manchu lakshmi
aadarsh balakrishna

More Telugu News