చంద్రబాబు, జగన్ కుమ్మక్కయ్యారు: సీపీఐ నేత రామకృష్ణ
- చంద్రబాబు, జగన్ వి లాలూచీ రాజకీయాలు
- వీళ్లిద్దరికీ మోదీ అంటే భయం
- వైసీపీవి రాజీనామాలు కాదు రాజీ - డ్రామాలు
చంద్రబాబునాయుడు తన అసంతృప్తినంతా బీజేపీపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప, తన పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీల రాజీనామాల గురించి ఆయన విమర్శలు చేశారు. ఇవి నిజమైన రాజీనామాలు కాదని, ‘రాజీ-డ్రామాలు’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్ లకు మోదీ అంటే భయమని అన్నారు. ఈ నెల 20న విజయవాడలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయ సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు.