software engineer: ప్రేమ విఫలం.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!

  • విప్రోలో పని చేస్తున్న యతీష్
  • ఉప్పల్ లో చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్
  • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ప్రేమలో విఫలమై ఎంతో మంది యువతీయువకులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం విదితమే. అయితే ఉన్నత విద్యావంతులు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఇలాంటి వాటికి పాల్పడుతుండటం ఆందోళన కలిగించేదే. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ లోని హెచ్ఎండీఏ లేఔట్ లో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది.

యతీష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వైఫల్యమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బండ్లగూడ నివాసి అయిన యతీష్ విప్రో సంస్థలో పని చేస్తున్నాడు. యతీష్ మరణ వార్త విని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు, యతీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
software engineer
suicide
wipro
love
failure

More Telugu News