ఆలేరు ఎమ్మెల్యే సునీతకు తప్పిన ప్రమాదం!

  • కారులో నాగోల్ కు వెళ్తుండగా సంఘటన
  • ఎమ్మెల్యే కారు, మరో కారు ఢీకొట్టుకున్న వైనం
  • ధ్వంసమైన రెండు కార్లు
నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా నాగోల్ కు ఆమె తన కారులో వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, మరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల తాను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని అన్నారు. కాగా, నాగోల్ లోని తన నివాసంలో సునీత విశ్రాంతి తీసుకుంటున్నారు.  
Go Back to Shorts
nalgonda
aleru
sunitha

More Telugu News