నాకు ‘ఆపరేషన్ గరుడ’ తెలియదు కానీ, కలామ్ చెప్పిన ‘గరుడ’ మాత్రం తెలుసు: లక్ష్మీనారాయణ
- కలామ్ చెప్పినట్టు గరుడ పక్షిలాంటి దృక్పథం అలవరచుకోవాలి
- సామాజిక వర్గం గురించి నేనెప్పుడూ ఆలోచించను
- ప్రజాదరణ కోసం నేను పని చేయను..పాకులాడను
సామాజిక వర్గం గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని, గడప దాటి బయటకు వచ్చిన తర్వాత సమాజమే తన వర్గమని, సామాజిక వర్గం అనే ఆలోచన నుంచి బయటపడితేనే సమాజ నిర్మాణం జరుగుతుందని అన్నారు. సమస్యలు పరిష్కారమై ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటానని చెప్పిన లక్ష్మీనారాయణ, తాను ఏం చేసినా, చిత్తశుద్ధితో చేస్తానని, ప్రజాదరణ కోసం తానెప్పుడూ పనిచేయనని, పాకులాడనని, ప్రజాదరణ అనేది సైడ్ ఎఫెక్ట్ లాంటిదని అభిప్రాయపడ్డారు.