30 మంది వేశ్యలతో ఫుట్ బాల్ జట్టుకు పార్టీ ఇచ్చి వీడ్కోలు చెప్పిన మెక్సికో!
- యూరప్ కు వెళ్లే ముందు పార్టీ
- పాల్గొన్న 9 మంది ఆటగాళ్లు
- వారిపై చర్యలు ఉండబోవని చెప్పిన అధికారులు
ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొమ్మిది మంది ఆటగాళ్ల కోసం వేశ్యలను పిలిపించారని, స్కాట్లాండ్ పై 1-0 తేడాతో జట్టు విజయం సాధించిన తరువాత, ఈ పార్టీ జరిగిందని చెబుతూ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా అక్కడి మ్యాగజైన్ ఒకటి ప్రచురించింది. ఈ వార్తలపై స్పందించిన అధికారులు, ఖాళీగా ఉన్న సమయంలో వారు పార్టీ చేసుకున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండవని వ్యాఖ్యానించడం గమనార్హం. వాళ్లు శిక్షణా శిబిరాలకు క్రమం తప్పకుండా హాజరయ్యారని, సెలవు రోజున వారి వ్యక్తిగత స్వేచ్ఛ వారిదేనని చెప్పారు.