Pawan Kalyan: పవన్ పర్యటన సందర్భంగా అపశ్రుతి.. ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరి మృతి

షార్ట్స్‌లో చూడండి
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటనను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై  ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ నేడు ఇక్కడ పర్యటించనున్నారు. దీంతో తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో పాయకరావుపేటలో విషాదం నెలకొంది.
Go Back to Shorts
Pawan Kalyan
Vizag
payakaraopet

More Telugu News