rana': రానా సరసన కథానాయికగా కల్కి కూచ్లిన్

షార్ట్స్‌లో చూడండి
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ రానా ముందుకెళుతున్నాడు. రానాకు వివిధ భాషల్లో మంచి క్రేజ్ ఉండటం వలన, ఆయనతో బహుభాషా చిత్రాలను రూపొందించడానికే దర్శకనిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా రానా తాజా చిత్రంగా 'హాథీ మేరే సాథీ' చిత్రం రూపొందుతోంది. హిందీతో పాటు తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

 తెలుగులో ఈ సినిమాకి 'అరణ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రానా సరసన కథానాయికగా బాలీవుడ్ నటి 'కల్కి కూచ్లిన్' నటిస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఆగస్టు నుంచి ప్లాన్ చేశారు. అడవుల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని రానా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.    
Go Back to Shorts
rana'
kalki

More Telugu News