బెట్టింగులో రూ.3 కోట్లు నష్టపోయిన సల్మాన్ సోదరుడు!
- దావూద్ అనుచరుడి వద్ద బెట్టింగ్
- డబ్బులు చెల్లించకపోవడంతో బెదిరింపులు
- మరింతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం
మే 16న థానెలోని డోమ్‌బీవ్లీలోని ప్రధాన బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో జలాన్ వారి కోసం ఎదురుచూస్తూ పోలీసులకు చిక్కాడు. అతడిని విచారిస్తున్న సమయంలో అర్బాజ్ పేరును బయటపెట్టాడు.
‘జూనియర్ కోల్‌కతా’ అని బెట్టింగ్ రాయుళ్లు ముద్దుగా పిలుచుకునే జలాన్ దేశవ్యాప్తంగా జరిగే బెట్టింగ్ వ్యాపారాలలో కీలకమైన వ్యక్తి. అతడి బెట్టింగ్ వ్యాపారాల వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లని పోలీసులు చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది.