Narendra Modi: సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ.. అమరావతి ప్రస్తావన తీసుకొచ్చిన లీ లూంగ్

  • సింగపూర్ పర్యటనలో భారత ప్రధాని
  • ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
  • అమరావతి ప్రస్తావన  తీసుకొచ్చిన సింగపూర్ ప్రధాని

భారత ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ప్రస్తావించారు. మోదీతో భేటీ అనంతరం లీ లూంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అన్నారు. లాజిస్టిక్ సహకారంపైనా ఇరు దేశాల నేవీల మధ్య ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ.. సింగపూర్ కన్సార్టియం ఆధ్వర్యంలో అమరావతి ప్రాజెక్టు పురోగతి బ్రహ్మాండంగా ఉందన్నారు. పూణెలోని విమానాశ్రయ అభివృద్ధికి మహారాష్ట్ర-సింగపూర్ సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని లీ పేర్కొన్నారు.

సింగపూర్ పర్యటనకు వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని లీ హసీన్ లూంగ్, అధ్యక్షురాలు హలీమా యాకోబ్‌లతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు.

More Telugu News