ఐఏఎస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బొత్స
- జగన్ ను విమర్శించడం తప్ప మహానాడులో చేసిందేమీ లేదు
- జేసీ దివాకర్ రెడ్డిని గెలిపించింది రాజశేఖరరెడ్డే
- ఏపీలో పంచ భూతాలను కూడా పంచుకు తింటున్నారు
గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేనటువంటి నాయకత్వం జేసీదని ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖరరెడ్డి తాడిపత్రికి వెళ్లి జేసీని గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పంచ భూతాలను సైతం పంచుకు తింటున్నారని దుయ్యబట్టారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఐఏఎస్ అధికారులు అధికార పార్టీ నేతల చెప్పులు మోస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.