hemachandra: డబ్బులు ఎగ్గొడదామని చూశాడు .. అందుకే కొట్టేశాను: సింగర్ హేమచంద్ర

  • ఈవెంట్ లో పాడించాడు  
  • డబ్బులు తరువాత ఇస్తానన్నాడు 
  • నాకు కోపం వచ్చేసింది  

సింగర్ గా హేమచంద్ర పలు సినిమాలకి పాడాడు .. అలాగే చాలా స్టేజ్ షోలు ఇచ్చాడు. అలా ఓ స్టేజ్ షోకి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటనను గురించి ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించాడు. "కామారెడ్డిలో ఓ ఈవెంట్ చేయడానికి నా టీమ్ తో కలిసి వెళ్లాను. షో అయిన తరువాత ఆ ఈవెంట్ లో మాతో పాడించిన వ్యక్తి కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడా అని చుట్టూ చూస్తే .. ఆ ఈవెంట్ నిర్వాహకులతో మాట్లాడుతూ కనిపించాడు.

ఎంతసేపు వెయిట్ చేసినా రావడం లేదు .. దాంతో నేను వెళ్లి విషయమేమిటని అడిగాను. ఇవ్వాల్సిన డబ్బులు ముందే ఇచ్చేశామనీ .. ఎక్స్ ట్రా అడుగుతున్నాడని నిర్వాహకులు నాకు చెప్పారు. 'మీ డబ్బులు రేపు ఇస్తాను వెళ్లిపోండి' అని ఆ వ్యక్తి నాతో అన్నాడు. ముందుగా చెప్పినట్టుగా అక్కడ ఇవ్వాల్సిందే అని అన్నాను. మాటామాటా పెరగడంతో కొట్టేశాను. హైదరాబాద్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టించాను .. డబ్బులు ఇచ్చాకే బయటికి వచ్చాడు. డబ్బులు ఎగ్గొట్టడం కంటే నీచమైన పని మరొకటి లేదనేది నా అభిప్రాయం" అని చెప్పుకొచ్చాడు.  

More Telugu News