సైనా నెహ్వాల్, కశ్యప్ లు డేటింగ్ లో ఉన్నారా?

  • ఇద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తలు
  • కశ్యప్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన సైనా
  • జోడీ అదిరింది అంటున్న నెటిజన్లు
ఇండియన్ స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే, తమ ప్రేమ వ్యవహారంపై వీరిద్దరూ ఇంతవరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా తమ ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా సైనా నెహ్వాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను అప్ లోడ్ చేసింది.

హైదరాబాదులోని ఓ రెస్టారెంటులో ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె తన అభిమానులతో పంచుకుంది. క్షణాల్లో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇద్దరిదీ పర్ఫెక్ట్ జోడీ అని కొందరు కామెంట్ చేయగా... మీ డేటింగ్ వార్తలను నిజం చేయండి ప్లీజ్ అంటూ మరి కొందరు స్పందించారు.

ఇప్పటికే ఎంతోమంది క్రీడాకారులు జీవిత భాగస్వాములుగా మారారు... మీరు కూడా వారిని అనుసరించండి అంటూ మరి కొందరు సూచిస్తున్నారు. మరి వీరిద్దరూ ఏం చేస్తారో వేచి చూడాలి. 
Go Back to Shorts
Saina Nehwal
parupalli kashyap
badminton
love
marriage

More Telugu News