భూకంపం వస్తుందన్న భయంతో తొక్కిసలాట... బీహార్ రైల్వే స్టేషన్ లో 100 మంది విద్యార్థులకు గాయాలు!
- ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు బయలుదేరిన 6 వేల మంది విద్యార్థులు
- భూకంపం వస్తోందని కేకలు పెట్టిన ఓ విద్యార్థి
- తొక్కిసలాట - గాయపడిన వారిలో 58 మంది పరిస్థితి విషమం
దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిలో 58 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. వీరికి సమీపంలోని సివిల్ హాస్పిటల్ లో చికిత్సను అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారికి చికిత్స చేసి పంపించామని అధికారులు తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారని అన్నారు.