ఐదేళ్లలో తొలిసారి... నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి!
- అండమాన్ ను దాటిన నైరుతి రుతుపవనాలు
- రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు
- జూన్ 8 నాటికి తెలంగాణకు
జూన్ 7 నాటికి రాయలసీమలో, 8 నాటికి తెలంగాణలో వర్షాలు కురవడం మొదలవుతుందని, ఆపై దేశమంతటికీ రుతుపవనాలు విస్తరిస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్ప పీడన ద్రోణి ఉందని, దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.