uddanam: ఉద్దానం బాధితుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచాం: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం దేశ, విదేశీ వైద్యులు, పరిశోధకులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల పంపిణీ, డయాలసిస్ చేపట్టాము. నీటి శుద్ధి, మినరల్ వాటర్ కేంద్రాల ఏర్పాటుపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో.. ‘రాష్ట్రంలో ఆక్వా ధరల పతనం, రైతుల సమస్యలపై అధికారులతో సమీక్షించాం. ఆక్వా ఎగుమతుల వల్ల విదేశీ వాణిజ్యం పొందే కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఈ నెల 26న ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని నిర్ణయించాం’ అని చంద్రబాబు తెలిపారు.

కాగా, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యలపై ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. 
Go Back to Shorts
uddanam
Chandrababu

More Telugu News