Tirumala: రమణదీక్షితులు తర్వాత నేనే సీనియర్ని.. నన్ను నియమించండి!: ఏఎస్ సుందరరామ దీక్షితులు

షార్ట్స్‌లో చూడండి
రమణదీక్షితులు స్థానంలో టీటీడీ ప్రధాన అర్చకుడిగా వేణుగోపాల దీక్షితులును నియమించడం తెలిసిందే. ఈ నియామకంపై ఏఎస్ సుందరరామ దీక్షితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీటీడీకి ఆయన ఓ లేఖ రాశారు. గొల్లపల్లి వంశంలో రమణ దీక్షితులు తర్వాత సీనియర్ని తానేనని, ఆయన స్థానంలో తనను నియమించాలని కోరారు. రమణదీక్షితులు తర్వాత వయసు దృష్ట్యా పూర్వపు మిరాశీదారుగా తనకు అవకాశమివ్వాలని, తనను పరిగణనలోకి తీసుకోకుండా మరొకరికి ప్రధాన అర్చక పదవిని ఇచ్చి, తనకు అన్యాయం చేశారని ఆ లేఖలో వాపోయారు.
Go Back to Shorts
Tirumala
ramana dikshitulu
as sundararama dikshitulu

More Telugu News