యూఎస్ లో 55 ఏళ్లు పైబడిన వారికి ‘మహానటి’ ఉచిత ప్రదర్శన
- మీ వయసు 55 ఏళ్లకు పైబడితే ఈ సినిమా ఉచితంగా చూడండి
- ఈ శని, ఆదివారాల్లో అవకాశం
- యూఎస్ లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ఛాన్స్
ఈ విషయం తెలుసుకున్న చిత్రయూనిట్ వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధుల కోసం ఈ సినిమాను వారి వద్దే ప్రదర్శిస్తామని ప్రకటించింది. తాజాగా, అమెరికాలో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన నిర్వాణ సినిమాస్ సంస్థ ఓ ప్రకటన చేసింది. ‘పెద్దలందరినీ గౌరవిస్తూ.. మీ వయసు 55 ఏళ్లకు పైబడితే యూఎస్ లో ఈ శనివారం (5/26), ఆదివారం (5/27) ‘మహానటి’ని ఉచితంగా వీక్షించండి. ఈ కింద పేర్కొన్న జాబితాలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది’ అంటూ సంబంధిత పోస్టర్ ను జతపరుస్తూ ఓ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.