తోట చంద్రశేఖర్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన పవన్ కల్యాణ్!
- అప్పట్లో ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్
- గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేత
- ఇప్పుడు జనసేనలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు
ఇటీవల జనసేనలో చేరిన చంద్రశేఖర్, అప్పటి నుంచి పవన్ కు సన్నిహితుడిగా మారి, సలహాలు, సూచనలు ఇస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రశేఖర్ ను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనూ నియమించిన పవన్, ఏపీకి వచ్చిన నిధుల లెక్కలు బయటకు తీయడంలో ఆయన పడిన శ్రమను గుర్తించారు. ఇప్పుడాయనకు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు లేదా గుంటూరు లోక్ సభ స్థానానికి ఆయన పోటీ పడవచ్చని తెలుస్తోంది.