'అలా చేస్తే మీకు వ్యాధి సోకుగాక'.. శాపం పెట్టి హెచ్చరించిన యూపీ మంత్రి
- రాజకీయ ప్రత్యర్థుల ర్యాలీకి వెళ్లకూడదు
- వెళితే జాండిస్ సోకుతుంది
- నేను మందిస్తేనే ఆ వ్యాధి నయమవుతుంది
- ఓం ప్రకాశ్ రాజ్భర్ విచిత్ర వ్యాఖ్యలు
అంతేకాదు, అలా సోకిన వ్యాధికి తాను మందిస్తేనే నయం అవుతుందని అన్నారు. అలాగే, యూపీ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ మోడల్‌ను యూపీలో ప్రవేశపెడతామని చెప్పారని, ఇప్పటికీ అది నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఓం ప్రకాశ్ రాజ్భర్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.