జగన్ మాటలు నమ్మి ఓట్లు వేయకండి.. అడ్డంగా దోచేస్తారు: పరిటాల సునీత
- అధికారం కోసం నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నారు
- చంద్రబాబు సుభిక్ష పాలనను భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోంది
- కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక గుణపాఠం
ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించకపోయినా, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని అన్నారు. బీజేపీ, వైసీపీలు కుమ్మక్కై చంద్రబాబు సుభిక్ష పాలనను భగ్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక గుణపాఠం వంటివని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.