ఎంపీ సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి!
- రమేష్ కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి
- ఆయన్ను చెప్పులతో కొట్టి తరిమేస్తారు
- జమ్మలమడుగు మినీ మహానాడులో ఆది
తాను మార్కెట్ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని కొంతమంది నీచంగా ప్రచారం చేస్తున్నారని, రామసుబ్బారెడ్డిని, ఆయన వర్గీయులను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. సీఎం రమేష్ ఇక్కడ కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నా, నాయకులు వందల కోట్ల విలువైన పనులు చేసుకుంటున్నా తాను అడ్డుపడలేదని చెప్పిన ఆదినారాయణరెడ్డి, తదుపరి ఎన్నికల్లో తాను జమ్మలమడుగు నుంచి కచ్చితంగా పోటీలో ఉంటానని, చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.