karnataka: లోక్ సభకు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే, ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీరాములు సైతం ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ స్థానానికి రాజీనామా సమర్పించారు. వీరిద్దరి రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించడం కూడా పూర్తయింది. ఈ రోజు కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం తన వైపు ఉందని నిరూపించుకోవాల్సి ఉన్న విషయం తెలిసిందే. అదే రోజు యడ్డి రాజీనామాకు ఆమోదం లభించడం గమనార్హం. యడ్యూరప్ప షిమోగ లోక్ సభ స్థానం నుంచి, శ్రీరాములు బళ్లారి లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 
Go Back to Shorts
karnataka
yedurappa
sriramulu

More Telugu News