chandramohan: ముందుగా శోభన్ బాబు .. ఆ తరువాత నేను చెన్నైలోనే ఉండిపోయాం!: చంద్రమోహన్

షార్ట్స్‌లో చూడండి
హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా చంద్రమోహన్ ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. తొలిసారిగా ఆయన సరసన కథానాయికగా నటిస్తే స్టార్ స్టేటస్ వస్తుందనే సెంటిమెంట్ అప్పట్లో బలంగా వుండేది. అందువలన ఆయనతో కలిసి నటించేందుకు అప్పట్లో చాలామంది హీరోయిన్లు ఉత్సాహాన్ని చూపేవారు. అలాంటి చంద్రమోహన్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను ముచ్చటించారు.

" సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు చాలామంది చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. శోభన్ బాబు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించి చెన్నైలోనే ఉండిపోయారు. నేను మాత్రం చెన్నైలోనే ఉంటూ షూటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చి వెళుతున్నాను. ఇలా చేస్తున్నవాడిని నేనొక్కడినే. నేను హైదరాబాద్ రాకపోవడం గురించి చాలామంది అడిగారు. ఓపక్క చెన్నై నుంచి మమ్మల్ని రమ్మని చెప్పి, మరోపక్క ఇతర భాషలకి చెందిన నటీనటులకు అవకాశం ఇస్తున్నప్పుడు .. అక్కడికి వచ్చి ఏం చేయాలని అడిగాను. తెలుగువాళ్లను ప్రోత్సహించమని కోరాను. కుటుంబపరమైన కారణాల వలన కూడా నేను చెన్నైలోనే వుండవలసి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
chandramohan

More Telugu News