మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న కర్ణాటక గవర్నర్‌.. సుప్రీంకోర్టుకెళ్లిన కాంగ్రెస్‌-జేడీఎస్‌

  • ఇంకా పూర్తికాని యడ్యూరప్ప బల నిరూపణ
  • ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్‌
  • గవర్నర్‌పై మరోసారి కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఆగ్రహం
బీజేపీ శాసన సభా పక్ష నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించి దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడడానికి కారణమైన కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ వాలా తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర కొత్త సీఎం యడ్యూరప్ప బలనిరూపణ తంతు ఇంకా పూర్తికాకముందే ఓ ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్‌ చేశారు.

మొన్నటి ఎన్నికలు 222 స్థానాలకు జరగగా మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్‌తో కలిపి కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి పెరగనుంది. ఈ విషయంలో గవర్నర్‌ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌లు సుప్రీంకోర్టును ఆ‍శ్రయించాయి. అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్‌ నామినేట్‌ చేశారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, బల పరీక్ష పూర్తయ్యేదాకా అది చెల్లకుండా ఆదేశాలివ్వాలని కోరాయి. దీనిపై రేపు విచారణ జరగనుంది. 
Go Back to Shorts
Congress
jds
Supreme Court

More Telugu News