నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ
- 'టాక్సీవాలా'తో రెడీగా విజయ్ దేవరకొండ
- 'గీత గోవిందం' కూడా దాదాపు పూర్తి
- త్వరలో సెట్స్ పైకి 'డియర్ కామ్రేడ్'
ఆల్రెడీ ఆయన క్రాంతి మాధవ్ కి .. నందినీ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి వున్నాడు. ఎవరి సినిమాను ముందుగా మొదలెట్టాలనే విషయంలో ఆయన బాగా ఆలోచించి , ముందుగా నందినీ రెడ్డి సినిమానే చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్ .. ప్రియాంక దత్ లు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఒక వైపున 'డియర్ కామ్రేడ్' చేస్తూనే మరో వైపున నందినీ రెడ్డి ప్రాజెక్టును కూడా విజయ్ దేవరకొండ పూర్తిచేయనున్నాడన్న మాట.