హైఎండ్ ఫీచర్లతో వివో ఎక్స్21 ఐ ఆవిష్కరణ... 19:9 డిస్ ప్లే
- ధర మన రూపాయిల్లో అయితే సుమారు 28,990
- హీలియో పి60 ప్రాసెసర్
- ఫోన్లో 90 శాతం స్కీన్ పరిమాణం
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 6.28 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియోతో ఫుల్ స్క్రీన్, సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 2.5 డి కర్వ్ డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ లో స్క్రీన్ 90.3 శాతం మేర ఉంటుంది. ఫోన్ వెనుక 12+5 మెగా పిక్సల్ కెమెరాలతో డ్యుయల్ సెటప్ ఉంది. ముందు భాగంలో 24 మెగా పిక్సల్స్ కెమెరా ఏర్పాటు చేశారు. 3,245 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. భారత్ లో విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.