pawan kalyan: కాసేపట్లో శెట్టిపల్లికి వెళ్లనున్న పవన్ కల్యాణ్.. టూర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం
చిత్తూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. నిన్న చిత్తూరు రోడ్డు విస్తరణ బాధితులను ఆయన పరామర్శించారు. కాసేపట్లో ఆయన శెట్టిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆయన కలవనున్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా అభిమాన సంఘాలు, జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్ కార్యాచరణ గురించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి తోడు తాను చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర గురించిన షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.