ishwarya rai: అప్పట్లో స్కూలు పిల్లలా ఆలోచించాను: ఐశ్వర్య రాయ్‌

షార్ట్స్‌లో చూడండి
కేన్స్‌లో వరుసగా 15వ సారి పాల్గొని అలరించిన బాలీవుడ్‌ తార ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ తాజాగా ఓ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడింది. గతంలో తాను చేసిన చిన్న చిన్న తప్పుల గురించి తెలిపింది. సినిమా అవకాశాల విషయంలో తాను అప్పట్లో స్కూలు పిల్లలా ఆలోచించానని చెప్పుకొచ్చింది.

షెడ్యూళ్ల విషయంలో తాను చాలా కచ్చితంగా ఉంటానని, దీంతో పెద్ద సినిమాల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వదులుకున్నానని తెలిపింది. తాను ఇక అలా చేయబోనని, సినిమాల విషయంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. దూకుడుగా ముందుకు వెళ్లేందుకు షెడ్యూళ్లను మరింత బాగా వేసుకుంటానని, చాలా మంది తన సహచర నటులు ఏడాదంతా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారని తెలిపింది.
Go Back to Shorts
ishwarya rai
school
canes

More Telugu News